సకల జగజ్జాల కర్తా భక్త
sakala jagajjaala karthaa bhaktha
పల్లవి
సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల జగజ్జాల||
1వ చరణం
నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల జగజ్జాల||
2వ చరణం
దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి ||సకల జగజ్జాల||
3వ చరణం
తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల జగజ్జాల||
4వ చరణం
రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి ||సకల జగజ్జాల||