♪♫
TG-4099
Telugu
ప్రాణేశ్వర
Praaneshwara
0
views
పల్లవి
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర||
1వ చరణం
నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2) నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర||
2వ చరణం
మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2) నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2) ||ప్రాణేశ్వర||
3వ చరణం
పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2) నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) ||ప్రాణేశ్వర||
4వ చరణం
నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2) జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర||
5వ చరణం
కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2) కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర||