TG-5352
Telugu

నే వేచియుంటిని నీదు స్పర్శకై నిలచియుంటినీ నీదు దర్శనంబుకై

Nee Veechiyuntini Needu Sparshakai Nilachiyuntinee Needu Darshananbukai

18
views
పల్లవి

నే వేచియుంటిని నీదు స్పర్శకై నిలచియుంటినీ నీదు దర్శనంబుకై జీవమా ప్రియ యేసువా నేస్తమా ఘన దైవమా ||నే వేచియుంటిని||

1వ చరణం

కఠిన శిలలైన మారిపోవునే నీ స్పర్శలో శిల్పముగా జిగట మన్నైన రూపొందునే నీ చేతిలో ఘన పాత్రగా రాతిని నన్ను మలచితివే నీ రూపములో మంటినినన్ను వాడుకొనవే నీ సేవలో ||జీవమా ప్రియ||

2వ చరణం

తొలగి పోవునే ప్రతిపాపము నీ ముఖకాంతిలో నా దేవా శుద్ధినొందునే ప్రతిపాపియూ నీ దర్శనములో నా ప్రభువా పాపిని నన్ను నిలిపితివే నీ పోలికలో నడిపించవే జాలితో నీ పరిచర్యలో ||జీవమా ప్రియ||

3వ చరణం

పులకించదా నిన్ను తాకిన ఏ తనువైనా నీ ప్రేమలో పరవశించదా నీవు తాకిన ఏ హృదియైనా నీ కృపలో హర్షించదా నిన్ను చూచిన ఏ మనసైనా ప్రహర్షించదా నీవు చూచిన ఏ బ్రతుకైనా ||జీవమా ప్రియ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.