TG-5356
Telugu

నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకొన్నాను

Needu Nee Naa Rakshakuni Naa Madiloo Cheerchukonnaanu

19
views
పల్లవి

నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకొన్నాను సమాధాన సంతోషము అనుభవించితి నేను 1.  ప్రభువాక్యము నా పాపముచూపె – హృదయము విరిచె ఆయన ఆత్మ గ్రుచ్చబడి నేను ఒప్పుకొంటిని – కోరితి రక్తము మదిలో 2.  ప్రభు నాపాపము చూపించగానే – ఒప్పుకొంటిని కప్పుకొనక విశ్వాసముతో కన్నీటితో – ఒప్పుకొనగ క్షమియించె 3.  పడమటికి తూర్పెంత దూరమో – నా పాపమునంత దూరపర్చితివి సముద్ర అగాధములలోన – నా పాపము పడవేసె 4.  మిక్కిలి శ్రమలో నెమ్మదికలిగె – నాశన గోతిలో నుండిలేపి నీ వీపువెనుక నా పాపములు – పారవేసితివి వీవు 5.  తుడిచితిననె ప్రభు నా పాపములు – జ్ఞాపకముంచుకొననని చెప్పె మంచు విడిచిపోయినరీతి – నా పాపము తొలగించె

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.