TG-5357
Telugu

నేడు యేసు లేచినాడు

Needu Yeesu Leechinaadu

19
views
పల్లవి

నేడు యేసు లేచినాడు నేడు యేసు లేచినాడు మనమానందము నొందుదాము (2) ||నేడు||

1వ చరణం

పరలోకము నుండి దూతలు దిగి వచ్చిరి సమాధికి (2) భద్రముగా చేసిరిగా బహు భద్రముగా చేసిరిగా ||నేడు||

2వ చరణం

మగ్దలేనే మరియ వేరొక మరియ సుగంధ తైలము తెచ్చుకొని (2) పూయుటకు వెళ్లిరిగా బహు పూయుటకు వెళ్లిరిగా ||నేడు||

3వ చరణం

వేకువ జామున యేసు ప్రభుండు తోటలో సంచరింపంగ (2) తోటమాలి అనుకొనెను బహు తోటమాలి అనుకొనెను ||నేడు||

4వ చరణం

నేను ఇంకను తండ్రి యొద్దకు త్వరగా వెళ్లిపోలేదు (2) కనుక నన్ను ముట్టవద్దు మరియమ్మ నన్ను ముట్టవద్దు ||నేడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.