TG-5358
Telugu

నేడే ప్రియరాగం పలికే నవ గీతం

Needee Priyaraagan Palikee Nava Geethan

21
views
పల్లవి

నేడే ప్రియరాగం పలికే నవ గీతం ప్రేమే మన కోసం వెలసే లోకాన శాంతి మురిసింది మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే||

1వ చరణం

దివినేలు దేవుడు ఉదయించగానే ఇలలోన ప్రకృతి పులకించెగా పరలోక దూతలు స్తుతియించగానే జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే||

2వ చరణం

మనిషైన సుతుడు జనియించగానే విశ్వాన గోళాలు విభవించెగా చిన్నారి యేసుని చిరునవ్వుతోనే నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే||

3వ చరణం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ టు యు లోకాన శాంతి మురిసింది మన మనస్సులో రాగాల కాంతి విరిసింది

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.