♪♫
TG-4122
Telugu
ప్రభువా నీ పరిపూర్ణత నుండి
Prabhuvaa Nee Paripoornatha Nundi
0
views
పల్లవి
ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు ||ప్రభువా||
1వ చరణం
జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
2వ చరణం
నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
3వ చరణం
దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
4వ చరణం
మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
5వ చరణం
ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము ||ప్రభువా||
6వ చరణం
కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక ||ప్రభువా||