♪♫
TG-5333
Telugu
నూతన సంవత్సరములో యేసు
Noothana Sanvathsaramuloo Yeesu
0
views
పల్లవి
నూతన సంవత్సరములో యేసు.. నూతన పరచుము నన్ను నూతన జీవమిచ్చి నూతన కృపనిమ్మయా (2) ఆనందమే సంతోషమే యేసయ్యలో నాకు సంబరమే (2) ||నూతన||
1వ చరణం
పాపమంత మన్నించయ్యా పరిశుద్ధ మనసు నాకు ఇమ్మయ్యా (2) ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||
2వ చరణం
వాక్యముతో కడుగుమయా పరిశుద్ధ ఆత్మను నాకిమ్మయ్యా (2) ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||
3వ చరణం
సత్యముతో నింపుమయా నీ సాక్షిగ నేనుండుటకు (2) ప్రభు నీతో నడుచుటకు నీ సన్నిధిలో ఉండుటకు (2) ||నూతన||