నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
Noothana Yerushaleem Digi Vachchuchunnadi
నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 1. శోభ కలిగిన - ఆ దివ్య నగరము వర్ణింప శక్యము - కానిదియే (2) బహు సహస్రముల - సూర్యుని కంటె (2) ప్రజ్వలించుచున్నది - మహిమవలెను ||నూతన యెరుషలేమ్||
2. పరిపూర్ణమైన -సౌందర్యమును పృథ్వికి - ఆనందముగాను (2) భూరాజులందరు - మహిమ తెచ్చెడి (2) మహిమగల నగరము - ఇదియే ||నూతన యెరుషలేమ్||
3. ధగధగ మెరయు - సూర్యకాంతం వలె జ్వలించుచున్న- దైవనగరమందు (2) నీతిమంతులే - సూర్యునివలెను (2) నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు ||నూతన యెరుషలేమ్||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.