TG-4168
Telugu

రాజులకు రాజైన ఈ

Raajulaku Raajaina Ee

0
views
పల్లవి

రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని ||రాజులకు||

1వ చరణం

కరుణ గల సోదరుండై ఈయన ధరణికేతెంచెనయ్యా (2) స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు పరలోక రాజ్యమును ||రాజులకు||

2వ చరణం

నక్కలకు బొరియలుండే నాకాశ పక్షులకు గూళ్లుండెను (2) ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు||

3వ చరణం

త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు (2) దరికి జేరిన వారిని ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము ||రాజులకు||