TG-3183
Telugu

భూపునాది మునుపే

Bhoopunaadhi Munupe

0
views
పల్లవి

భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము.. నూతన లోకము… నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో.. గుడారమై యుండును… మనమంతా మరలా పాడెదము ||భూపునాది||

1వ చరణం

జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును (2) తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ||భూపునాది||

2వ చరణం

వేదన బాధయు – కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు (2) సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును ||భూపునాది||