TG-5670
Telugu

రారాజు జన్మించే ఇలలోన

Raaraaju Janminchee Ilaloona

0
views
పల్లవి

రారాజు జన్మించే ఇలలోన యేసు రారాజు జన్మించే ఇలలోన (2) ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా రండీ మనమంతా చాటి చెప్పుదాం (2) ఓ సోదరా... ఓ సోదరీ... (2) విష్ యు హాప్పీ క్రిస్మస్ అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు||

1వ చరణం

అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2) రాజులకు రారాజు పుడతాడంటూ లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2) రాజాధి రాజుని చూడాలంటూ (తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి (2) ||ఓ సోదరా||

2వ చరణం

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా (అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2) రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2) ఈ లోక రక్షకుని చూడాలంటూ (ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి (2) ||ఓ సోదరా||