♪♫
TG-4198
Telugu
సాగేను నా జీవ నావ
Saagenu Naa Jeeva Naava
0
views
పల్లవి
సాగేను నా జీవ నావ దొరికేను ఓ ప్రేమ త్రోవ నా యేసు పయనించు దారదీ కల్వరిగిరి చేరే త్రోవదీ ఆ….ఆ….ఆ…. ||సాగేను||
1వ చరణం
నేనెవరో నేనెరుగని తరుణంలో నా ఉనికిని యేర్పరచిన నాథుడు విశ్వాసపు నా జీవనతీరంలో ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు ఆ….ఆ….ఆ…. ||సాగేను||
2వ చరణం
తన రక్త ధారలను ప్రోక్షించి నా హృదిలో పాపము తొలగించెను అనురాగ రసరమ్య గీతిక నా హృదిలో ప్రేమను వెలిగించెను ఆ….ఆ….ఆ…. ||సాగేను||
3వ చరణం
ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట వాడుటకు మమ్మును బలపరచుము ఆ….ఆ….ఆ…. ||సాగేను||