TG-4201
Telugu

సాగిలపడి మ్రొక్కెదమ

Saagilapadi Mrokkedamu

0
views
పల్లవి

సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి||

1వ చరణం

మోషేకంటే శ్రేష్టుడు అన్ని మోసములనుండి విడిపించున్ (2) వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

2వ చరణం

అహరోనుకంటే శ్రేష్టుడు మన ఆరాధనకు పాత్రుండు (2) ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

3వ చరణం

ఆలయముకన్న శ్రేష్టుడు నిజ ఆలయముగ తానే యుండెన్ (2) ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

4వ చరణం

యోనా కంటె శ్రేష్టుడు ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2) మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

5వ చరణం

సొలోమోను కన్న శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు (2) పదివేలలో అతిప్రియుండు పదిలముగ మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

6వ చరణం

రాజులకంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెన్ (2) రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము (2) ||సాగిలపడి||

7వ చరణం

అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు (2) హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము (2) ||సాగిలపడి||