సాగి సాగి పొమ్ము
Saagi Saagi Pommu
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2) యేసుతోనే కడవరకు పరముదాక యేసయ్యతోనే కడవరకు పరముదాక వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2) విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా నా హృదయమా ||సాగి||
ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2) ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2) విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా ఎంతో వింతగా ||సాగి||
పాపమందు నిలచిన పడిపోదువు పరలోక యాత్రలో సాగకుందువు (2) ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2) నిత్య జీవ మార్గమందు సాగిపోదువు కొనసాగిపోదువు ||సాగి||
విశ్వాస పోరాటంలో విజయ జీవితం విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును (2) విలువైన ఆత్మతో బలము నొందుము (2) వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు పడిపోక నిలుతువు ||సాగి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.