TG-4250
Telugu

షారోను రోజా యేసే

Shaaronu Rojaa Yese

0
views
పల్లవి

షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని ప్రాణప్రియుని కనుగొంటిని (2) అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను||

1వ చరణం

యేసుని ఎరుగని వారెందరో వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) దప్పికతో ఉన్న ప్రభువునకే (2) సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా||

2వ చరణం

సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగినవాడు (2) చేసిన సేవను మరువకా (2) ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా||