TG-3965
Telugu

నీవు లేనిదే నేను

Neevu Lenide Nenu

18
views
పల్లవి

నీవు లేనిదే నేను లేను ప్రభువా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2) నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2) మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2) నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు||

1వ చరణం

గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2) నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2) ఆ సిలువే నాకు శరణం నా పాప పరిహారం (2) ||నీవు||

2వ చరణం

అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2) నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2) ఆ సిలువే నాకు నిరతం నా జీవిత చిరుదీపం (2) ||నీవు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.