నీవు లేని క్షణమైనా
Neevu Leni Kshanamainaa
నీవు లేని క్షణమైనా ఊహించలేను నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) నీవే నా కాపరి – నీవే నా ఊపిరి నీవే నా సర్వము యేసయ్య నీతోనే జీవితం – నేనే నీకంకితం గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని||
శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా నను ధైర్యపరిచె నీ వాక్యం సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా నను మునగనీయక లేవనెత్తిన (2) నీవే నా కండగా – నాతో నీవుండగా భయమన్నదే నాకు లేదూ సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||
శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా అవి నన్ను కాల్చజాలవుగా దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా నాకేమాత్రం హాని చేయవుగా (2) వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన వేదనలే తొలగించిన యేసయ్యా సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.