♪♫
TG-3964
Telugu
నీవు లేని రోజు
Neevu Leni Roju
0
views
పల్లవి
నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని||
1వ చరణం
బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2) నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే||
2వ చరణం
ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2) నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||