TG-4272
Telugu

సిలువ చెంతకు రా

Siluva Chenthaku Raa

0
views
పల్లవి

సిలువ చెంతకు రా (4) సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్లెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ||

1వ చరణం

సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ||

2వ చరణం

సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును (2) రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ||