TG-3073
Telugu

ఆశ్రయమా ఆధారమా

Aashrayamaa Aadhaaramaa

0
views
పల్లవి

ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2) నిను విడచి నేనుండలేను క్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా||

1వ చరణం

కష్ట కాలములు నన్ను కృంగదీసినను అరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2) నా వెంటే నీవుండినావు నీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా||

2వ చరణం

భక్తిహీనులు నాపై పొర్లిపడినను శత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2) నా వెంటే నీవుండినావు కాపాడి రక్షించినావు (2) ||ఆశ్రయమా||

3వ చరణం

మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను బంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2) నా వెంటే నీవుండినావు దయచూపి దీవించినావు (2) ||ఆశ్రయమా||