TG-3071
Telugu

ఆశయ్యా చిన్న ఆశయ్

Aashayyaa Chinna Aashayyaa

0
views
పల్లవి

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని (2) ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో||

1వ చరణం

నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా (2) నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా (2) నీతో నడువాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||

2వ చరణం

సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా (2) నీలో ప్రేమా నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2) నీలా ఉండాలని – నీతో ఉండాలని చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||