♪♫
TG-3067
Telugu
ఆశ్చర్యమైన ప్రేమ
Aascharyamaina Prema
0
views
పల్లవి
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ మరణము కంటె బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన||
1వ చరణం
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన||
2వ చరణం
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే ||ఆశ్చర్యమైన||
3వ చరణం
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన||
4వ చరణం
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ||ఆశ్చర్యమైన||