♪♫
TG-4274
Telugu
సిలువలో ఆ సిలువలో
Siluvalo Aa Siluvalo
0
views
పల్లవి
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||
1వ చరణం
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ- మోయలేక మోసావు (2) కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి||
2వ చరణం
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2) దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2) ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి||
3వ చరణం
నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2) నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2) సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి||