ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ

enduku marrachithivi yeesuni preema

🎵 TG-290💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు మఱచితివి ఎందుకు మఱచితివి పొందితివి నిందలు సుందర మగునట్టి సుఖమైన ప్రభు ప్రేమ ||ఎందుకు మఱచితివి||

1వ చరణం

దేవగ్రంథము నీవు చదువలేదా భావమున దానిఁ గైకొనలేదా సేవక వృత్తులు సేయక పోతివి చావరాని చావు సంపాదించితి వయ్యో ||ఎందుకు మఱచితివి||

2వ చరణం

చిందెను రక్తము సిలువపైనిఁ పొందెను గష్టము మేకుల పోట్ల నెంద ఱెందఱు కల్వ రీమెట్టపై నతని నిందించి చంపిరి నిర్దయులై యకటా ||ఎందుకు మఱచితివి||

3వ చరణం

పాపేచ్ఛలోనుండి మరలి వాని శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము కాపాడుటకు దయతోఁ గనిపెట్టి యున్నాఁడు పాపి నీ విభుఁడైన ప్రభు మార్గమునఁ బొమ్ము ||ఎందుకు మఱచితివి||

Report Error