TG-2904
Telugu

మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా

manaserigina yeesayyaa madiloona jathagaa

76
views
పల్లవి

మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు (2) హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన||

1వ చరణం

నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.