నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా

nannenthagaanoo preeminchina prabhuvaa naa

🎵 TG-2903🌐 Telugu
పల్లవి

నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా నా దీన బ్రతుకునే దీవించిన దేవా (2) నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును నా యవ్వనమంతా… నా జీవితమంతా ||నన్నెంతగానో||

1వ చరణం

ధరలోని మన్నుతో సమమైన నన్ను ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు అన్నీ నీవే నాకై సమకూర్చినావు ఉన్నాను నీ తోడు భయపడకన్నావు వాక్యపు మన్నాతో పోషించిన నన్నే ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే ||నిన్నే||

2వ చరణం

దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో మరణపు విల్లును విరచిన దేవా నీలో ||నీలో||

Report Error