TG-4279
Telugu

సిలువే నా శరణాయెను రా

Siluve Naa Sharanaayenu Raa

0
views
పల్లవి

సిలువే నా శరణాయెను రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము చూచితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా నీ… సిలువే నా శరణాయెను రా సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ చాలును రా నీ… సిలువే నా శరణాయెను రా పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక సిలువ యెదుటను నిలచినాడను రా నీ… సిలువే నా శరణాయెను రా శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ నీ దరి జేరితి రా నీ… సిలువే నా శరణాయెను రా Siluva Yande Mukthi Balamu Choochithi Raa Siluvanu Vraali Yesu – Palikina Palukulandu Viluvaleni Premaamruthamu Grolithi Raa Siluvanu Choochu Koladi – Shila Samaanamaina Manasu Naligi Karigi Neeraguchunnadi Raa Siluvanu Darachi Tharachithi – Viluvakandagaraani Nee Krupa Kalushamellanu Baapaga Chaalunu Raa Palu Vidha Pathamularasi – Phalithamemi Gaanaleka Siluva Yedutanu Nilachinaadanu Raa Sharanu Yesu Sharanu Sharanu – Sharanu Sharanu Naa Prabhuvaa Duritha Dooruda Nee Dari Jerithi Raa