TG-1892
Telugu

షారోను రోజా యేసే

ssaaroonu roojaa yeesee

41
views
పల్లవి

షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని ప్రాణప్రియుని కనుగొంటిని అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేను వెళ్ళెదను (2) ||షారోను||

1వ చరణం

యేసుని ఎరుగని వారెందరో వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు దప్పికతో ఉన్న ప్రభువునకే సిలువను మోసే వారెవ్వరు (2) ||అడవులైనా||

2వ చరణం

సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగినవాడు చేసిన సేవను మరువకా ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2) ||అడవులైనా||