TG-5759
Telugu

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

Soolipoovaladu Manassaa Soolipoovaladu

0
views
పల్లవి

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) ||సోలిపోవలదు||

1వ చరణం

ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా (2) ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా (2) ||సోలిపోవలదు||

2వ చరణం

శోధనలను జయించినచో భాగ్యవంతుడవు (2) జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము (2) ||సోలిపోవలదు||

3వ చరణం

వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు (2) తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు (2) ||సోలిపోవలదు||