సిలువలో నీ ప్రేమ

siluvaloo nee preema

🎵 TG-2221🌐 Telugu
పల్లవి

సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2) ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2)      ||సిలువలో||

1వ చరణం

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం నను విడిపించుటకు – విలువను విడిచితివి పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2)     ||ఘోర పాపిని||

2వ చరణం

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి మరణము దాటుటకు – బలిగా మారితివి అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము నిను చాటించుటకు – వెలుగై సాగెదను ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను

Report Error