♪♫
TG-5782
Telugu
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము
Sthoothramu Sthoothramu Oo Deevaa Ee Veekuvanee Sthoothramu
0
views
పల్లవి
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా 1. పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య 2. కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా 3. పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా