♪♫
TG-5116
Telugu
నమ్మదగినవాడవు నెమ్మదిని చేకూర్చను
Nammadaginavaadavu Nemmadini Cheekoorchanu
0
views
పల్లవి
నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చను యిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి 1. అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును 2. నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును 3. యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను 4. ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడయందున నిందారహిత సంపూర్ణమహిమలో - నుండునట్లుగ నిల్పను 5. పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద 6. శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము