TG-5114
Telugu

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా

Nammakuraa Nammakuraa Ee Lookan Nammakuraa

0
views
పల్లవి

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2) మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా||

1వ చరణం

ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా (2) వస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా||

2వ చరణం

ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా (2) డబ్బును నమ్మకురా గబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా||

3వ చరణం

ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా (2) ధనము కోరిక తీర్చునురా నరకానికి చేర్చునురా (2) ||నమ్మకురా||