TG-4340
Telugu

తనువు నా దిదిగో

Thanuvu Naa Didigo

0
views
పల్లవి

తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ దినములు క్షణములు – దీసికొని యవి నీదు వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు||

1వ చరణం

ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు||

2వ చరణం

స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు||

3వ చరణం

వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు||

4వ చరణం

నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు||

5వ చరణం

ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్ నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు||