♪♫
TG-3335
Telugu
ఎల్లవేళలందు
Ella Velalandu
0
views
పల్లవి
ఎల్లవేళలందు – కష్టకాలమందు వల్లభుండా యేసున్ స్తుతింతున్ ఎల్లను నీవే నా కెల్లెడల వల్లపడదే వివరింపన్ (2) విమోచకుడా – విమోచన నీవే రక్షకుడవు – నా రక్షణ నీవే (2) ||ఎల్లవేళలందు||
1వ చరణం
సృష్టికర్తవు – సహాయము నీవే ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2) ||ఎల్లవేళలందు||
2వ చరణం
జ్ఞానము నీవే – నా పానము నీవే దానము నీవే – నా గానము నీవే (2) ||ఎల్లవేళలందు||
3వ చరణం
జ్యోతివి నీవే – నా నీతివి నీవే ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు||
4వ చరణం
నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2) ||ఎల్లవేళలందు||
5వ చరణం
జీవము నీవే – నా దేవుడవు నీవే పావన నీవే – నా కావలి నీవే (2) ||ఎల్లవేళలందు||
6వ చరణం
కాంతియు నీవే – నా శాంతియు నీవే సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు||