♪♫
TG-4683
Telugu
ఉన్నాడు దేవుడు నాకు తోడు
Unnaadu Deevudu Naaku Thoodu
0
views
పల్లవి
ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడడెన్నడు ఎడబాయడు (2) కష్టాలలోన నష్టాలలోన వేదనలోన శోధనలోన ||ఉన్నాడు||
1వ చరణం
గాఢాంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగి తేలినా (2) కరుణ లేని లోకము కాదన్ననూ (2) కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు||
2వ చరణం
యెహోవ సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును (2) కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2) బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||