♪♫
TG-3651
Telugu
మధురం ఈ శుభ సమయ
Madhuram Ee Shubha Samayam
0
views
పల్లవి
మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం (2) ఆనందమే ఇరువురి హృదయం (2) జత కలిసె ఈ తరుణంలో (2) నవ దంపతులకు స్వాగతం ||మధురం||
1వ చరణం
ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2) మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా (2) ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి ||మధురం||
2వ చరణం
ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము మనసులో వెలియగ మమతలు విరబూయగా (2) అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2) మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి ||మధురం||