TG-4474
Telugu

యేసే గొప్ప దేవుడు

Yese Goppa Devudu

0
views
పల్లవి

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2) యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2) స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||

1వ చరణం

మహా శ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగ నిలచిన యోబు వలె నే జీవించెదను (2) అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

2వ చరణం

ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును (2) మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

3వ చరణం

జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలె నే జీవించెదను (2) అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||