ఓ రక్షకా, నీ దివ్య

oo rakssakaa, nee divya

🎵 TG-057💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయం దను గ్రహించు నీదు దీవెనన్.

1వ చరణం

గృహంబుఁ జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా ఇచ్చట సేవఁ జేయు మమ్మును పాపంబుఁ జేయకుండఁగాయుము. ||ఓ రక్షకా,||

2వ చరణం

మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకా బాధ నుండి నీ బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా. ||ఓ రక్షకా,||

Report Error