TG-056
Telugu

రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ జీఁకతులుఁ

raathriyayyena nnedambaayaku dhaathripaim jeemkathulum

206
views
పల్లవి

రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.

1వ చరణం

ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వఁజాలను నీకంటె నాకు లేదుగా లోక ప్రకాశుఁడా, నన్ బాయకు. ||రాత్రియయ్యెన న్నెడఁబాయకు||

2వ చరణం

నా చెంత నీవు చేరియుండఁగ ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా? నా శైలమా, నన్ బాసిపోకుమా. ||రాత్రియయ్యెన న్నెడఁబాయకు||

3వ చరణం

సమృద్ధుఁడు సహాయుఁ డాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? మా మధ్యమున్ సర్వేశ పాయకు. ||రాత్రియయ్యెన న్నెడఁబాయకు||

4వ చరణం

రేవు నేఁ జేరఁబోవు వేళలోన్ కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్ బాసిపోకుము. ||రాత్రియయ్యెన న్నెడఁబాయకు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.