దేవ నీకు స్తోత్రము ఈ

deeva neeku sthoothramu ee

🎵 TG-050💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ నీకు||

1వ చరణం

పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ నీకు||

2వ చరణం

చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ నీకు||

3వ చరణం

నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ నీకు||

Report Error