TG-4510
Telugu

యేసు రాజు రాజుల రాజై

Yesu Raaju Raajula Raajai

0
views
పల్లవి

యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె హోసన్నా జయమే – హోసన్నా జయమే హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||

1వ చరణం

యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) భయము లేదు జయము మనదే (2) విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా||

2వ చరణం

శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధియైనా (2) యేసు గాయముల్ స్వస్థపరచున్ (2) రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా||

3వ చరణం

హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2) యేసు రాజు మనకు ప్రభువై (2) త్వరగా వచ్చుచుండె (2) ||హోసన్నా||