అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము

anudinamu prabhuni sthuthiyinchedamu anukssannamu

🎵 TG-1783🌐 Telugu
పల్లవి

అనుదినము ప్రభుని స్తుతియించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరగనిది ప్రభు ప్రేమ (2)       ||అనుదినము||

1వ చరణం

ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమియించునది నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నింపునది (2)      ||అల్లుకుపోయేది||

2వ చరణం

ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చునది (2)       ||అల్లుకుపోయేది||

Report Error