TG-1785
Telugu

మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు

maatlaadee yeesayyaa naathoo maatlaaduchunnaadu

48
views
పల్లవి

మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడు (2) (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4)        ||మాట్లాడే||

1వ చరణం

వెన్నలాంటి కన్నులలో కురిసే తన ప్రేమను పంచాలని (3) వేకువనే తట్టుచున్నాడు కునుకని నిద్రపోని నా యేసయ్యా తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే||

2వ చరణం

అరుణోదయమున నేను లేచి కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను ఉత్సాహగానముతో యేసయ్యను సంగీత స్వరములతో ఘనపరచెదను ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు లోకము నుండి నన్ను ప్రత్యేకించి మైమరిపించాడు మహనీయుడు ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు జీవముగల సంఘములో నిలిపియున్నాడు తన మాటతో నన్ను బలపరచాడు కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.