TG-4521
Telugu

యేసు వలె

Yesu Vale

0
views
పల్లవి

యేసు వలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2) ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2) నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2) ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు – నీ సన్నిధిని పొందే సమయమదే నీ సన్నిధి చాలు – యేసు… నీ సన్నిధి చాలు – (2) విశ్వాసములో నన్ను స్థిరపరచే – ప్రతి పరిస్థితికై స్తోత్రం కృప నుండి కృపకు నడిపినట్టి – నీ కనికరముకై స్తోత్రం (2) ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు – నీలో ఆనందించే తరుణమదే ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు – నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె నీవే చాలు యేసయ్యా – నీవుంటే చాలు యేసయ్యా… – (2) Yesu Vale Nannu Maarchunatti – Prathi Anubhavamukai Sthothram Shishyunigaa Nannu Siddhaparache – Prathi Avamaanamukai Sthothram (2) Prathi Aranyamukai Thandree Kruthagnthalu – Apavaadipai Naaku Jayamichchaavu Prathi Edaarikai Thandree Kruthagnathalu – Jeevajalamai Nannu Thrupthi Parachaavu Neeve Jeeva Jalamu – Thandri.. Neeve Jeeva Jalamu – (2) Nithyathvamukai Nannu Nadipinche – Prathi Savaalukai Sthothram Sampoornunigaa Nannu Maarchunatti – Prathi Samayamukai Sthothram (2) Prathi Kanneetiki Thandree Kruthagnathalu – Nee Mukhamunu Darshimpa Kaaranamade Prathi Otamiki Thandree Kruthagnathalu – Nee Sannidhini Ponde Samayamade Nee Sannidhi Chaalu – Yesu.. Nee Sannidhi Chaalu – (2) Vishwaasamulo Nannu Sthiraparache – Prathi Paristhithikai Sthothram Krupa Nundi Krupaku Nadipinatti – Nee Kanikaramukai Sthothram (2) Prathi Shodhanakai Thandree Kruthagnathalu – Neelo Aanandinche Tharunamade Prathi Pareekshakai Thandree Kruthagnathalu – Nee Vishwaasyatha Maa Yeda Rujuvaaye Neeve Chaalu Yesayyaa – Neevunte Chaalu Yesayyaa… – (2)