♪♫
TG-4676
Telugu
ఉన్నత దుర్గము నా దేవుడే
Unnatha Durgamu Naa Deevudee
0
views
పల్లవి
ఉన్నత దుర్గము - నా దేవుడే నా రక్షకుడే - నాకాశ్రయుడు 1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది 2. నా కోటయు నాశైలము ఆయనే నాకేడెము రక్షణ శృంగమును ఉన్నతమగు దేవుడే - నాకా శ్రయ దుర్గము 3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు రత్నవర్ణుడు - నాకతి ప్రియుడు పదివేల మందిలో - అతని గుర్తించెదను 4. నిత్యజీవము - మెండుగ నొసగి పరమాహారము - తృప్తిగ నిచ్చె నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము 5. విజయ గీతము - పాడెద ప్రభుకే విజయము నిచ్చెను - శత్రువుపైన ఉన్నత దుర్గముపై నెక్కించెను స్తోత్రము 6. మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు ఇహకేతెంచును - నాకై త్వరలో హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును