TG-4675
Telugu

ఉన్నత గృహమును త్వరగా చేరి

Unnatha Gruhamunu Thvaragaa Cheeri

0
views
పల్లవి

1.  ఉన్నత గృహమును త్వరగా చేరి సంపన్నుని దర్శింతును - ఈ పేదగు నా కోర్కె సఫలము చేసిన నాథుని కొనియాడుదున్ 2.  దూతల మధ్యను స్తోత్రము లొందెడు ప్రభుని స్తోత్రింతును - సు గంధము వీచెడి పుష్ప రాజంబుల మధ్యను నిద్రింతున్ 3.  ఆకాశ గణములు సేవించుచుండగ వీకతో వారిజేరుదున్ - నా యేసుని స్తుతుల నోరార పాడి భాసురముగ నుతింతున్ 4.  స్ఫటిక నది తీరమున నేను పాడుచు తిరుగుదును - ఆ బంగారు వీధిలో యేసుతో నేను రంగుగ నడుగిడుదున్ 5.  పలువిధ మృగములు పైబడినను నెవ్విధమున భయపడను - ఆ వెంగియు సింహము నాపై వచ్చిన నగవుతో రమ్మనెదన్ 6.  పక్షులు అయ్యెడ ననేకముండును వృక్షఫలములుండున్ - నా రక్షకుడగు యేసు నాకై చేర్చిన అక్షయ ధనముండున్ 7.  పేతురు యోహాను పౌలుతో నేనును ప్రీతితో వసియింతును - నా చల్లని మిత్రుని ఇంటను హర్షముతో హల్లెలూయ పాడెదను