TG-3024
Telugu

ఆకాశమందున్న ఆసీనుడా

Aakaashamandunna Aaseenudaa

0
views
పల్లవి

ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||

1వ చరణం

దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||

2వ చరణం

గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||

3వ చరణం

పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||