TG-2516
Telugu

సుధా మధుర కిరణాల అరుణోదయం

sudhaa madhura kirannaala arunnoodayam

38
views
పల్లవి

సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణం అరుణోదయం (2) తెర మరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా||

1వ చరణం

దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2) ||సుధా||

2వ చరణం

లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2) ||సుధా||